Friday, May 4, 2012

megHasandhesamu...మేఘసందేశము


cinema: megHasandhesamu
music: ramesnayudu

song 1 - ninnatidhaakaa silanainaa... నిన్నటిదాకా శిలనైనా...
singer: suseela P


పల్లవి:
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదముసోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..
నీ మమతా వేశపు వెల్లువలో... గోదారి గంగనై పొంగుతు ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదముసోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..

చరణం: 1
సరస సరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారంగిని (2)
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక (2)
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాస శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదముసోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..
నీ మమతా వేశపు వెల్లువలో... గోదారి గంగనై పొంగుతు ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదముసోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..

చరణం: 2
నిన్నే ఆరాధించు నీ దాసిని.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని (2)
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే (2)
చిరునవ్వులో నేను సిరిమల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదముసోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..
నీ మమతా వేశపు వెల్లువలో... గోదారి గంగనై పొంగుతు ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదముసోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..



song 2 - aakaasa dhesaana... ఆకాశ దేశానా...
singer: yesudhaas K J


పల్లవి:
ఆకాశ దేశానా... ఆషాఢ మాసానా... 
మెరిసేటి ఓ మేఘమా...(2)
విరహమో దాహమో విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం...

చరణం: 1
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై  (2)
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి ఓలే నిలిచానని 
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో 
విన్నవించు నా చెలికి విన్న వేదన.. నా విరహ వేదన...
ఆకాశ దేశానా... ఆషాఢ మాసాన... 
మెరిసేటి ఓ మేఘమా...(2)

చరణం: 2
రాలు పూల తేనియకై.. రాతి పూల తుమ్మెదనై... (2)
ఈ నిశీధి నీడలలో నివురు లాగ మిగిలానని శిధిల జీవినైనానని 
తొలకరి మెరుపుల లేఖలతో 
రుధిర భాష్పజలదారలతో.. ఆ... ఆ ...ఆ...
విన్నవించు నా చెలికి మనో వేదనా నా మరణ యాతనా...


ఆకాశ దేశానా... ఆషాఢ మాసాన... 
మెరిసేటి ఓ మేఘమా...(2)
విరహమో దాహమో విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం...



song 3 - navarasa sumamaalikaa... నవరస సుమమాలికా
singer: yesudhaas K J


నవరస సుమమాలికా 
నా జీవనాధార నవ రాగమాలికా
నవరస సుమమాలికా
(స్వరాలు)
నవరస సుమమాలికా 
(స్వరాలు)
త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ 
తెలుగింటిలోన వెలిగించిన నాద సుధామయ రసదీపిక 
నవరస సుమమాలికా 

అందాలు అలలైన మందాకిని
మందార మకరంద రసవాహిని 
ఆమె చరణాలు అరుణ కిరణాలు 
ఆమె నయనాలు నీల గగనాలు 
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు 
ఆ చిరునవ్వు లేత నెలవంక
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక 
నవరస సుమమాలికా (2)
నా జీవనాధార నవ రాగమాలికా
నవరస సుమమాలికా (2)


శృంగార రస రాజ కల్లోలిని 
కార్తీక పూర్ణేందు కల్హారిణి
ఆమె అధరాలు ప్రణయ మధురాలు 
ఆమె చలనాలు శిల్ప గమనాలు 
ఆ దర్శనాలు నా జన్మకి మిగిలిన సుందర సుఖతరుణాలు 
ఆ కనుచూపు నాకు కడదాక 
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైన లేని ప్రియలేఖ  

నవరస సుమమాలికా (2)
నా జీవనాధార నవ రాగమాలికా
నవరస సుమమాలికా (2)


song 4:  paadanaa vaaNi kaLyaaNigaa..
singer: Dr. BaalamuraLi KrishNa MangaLampalli


పల్లవి:
ఆ ఆ ఆ
గమదని స ని ప మ ని రి గ మ రి గ ని రి స మమ గ గ ద ప ద ప మ గ ని ద ని ద ప మ ద ని
స ని గ రి స ని ద ప స ని ద మ రిసని దపమ నిసని గమగ స ని ద ప మ రి గ (?)
పాడనా వాణి కళ్యాణిగా (2)
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా
నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వరప్రపంచక మధుర గాన సుఖ వాణిగా..ఆ. ఆ..
పాడనా వాణి కళ్యాణిగా (2)

చరణం: 1
తనువణువణువున తంబుర నాదము నవనాడుల శృతి సేయగా.. ఆ.. ఆ..
గ రి స ని ద ని మ ద ని స ని ద ప ద గ మ స ని ద ప మ (?)
ఎద మృదంగమై తాళ లయగతులు గమకములకు జతగూడగా
అక్షర ధీపారాధనలో స్వర లక్షణ హారతులీయగా (2)
తరంతరము నిరంతరము గానాభిషేకమొనరించి తరించగ
పాడనా వాణి కళ్యాణిగా (2)

చరణం: 2
స్వరముఖ రిత రి ఝరులు లహరులై(?) దేవి పాదములు కడుగగా
ద ని గ రి ని రి మ గ రి గ గ మ గ మ ని ద గ రి ని ద మ ని ద మ గ రి మ గ రి (?)
లయ విచలిత గగనములు మేఘమై తానములే చేయించగా
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై (2)
తరంతరము నిరంతరము గీతాభిషేకమొనరించి తరించగ
పాడనా వాణి కళ్యాణిగా (2)
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా
నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వరప్రపంచక మధుర గాన సుఖ వాణిగా..
ఆ. ఆ...