cinema: saagarasamgamam
music: iLayaraajaa
song 1 --- om nam:ssivaayaa - ఓం.. నమ:శ్శివాయ..
singer: Her Highness Janaki S
పల్లవి:
ఓం.. ఓం.. ఓం..
ఓం.. నమశ్శివాయ.. ఓం.. నమశ్శివాయ...
చంద్ర కళాధర సహృదయ... (2)
సాంద్రకళా పూర్ణోదయ.. లయ నిలయా...
ఓం...
ఓం... నమశ్శివాయ.. ఓం... నమశ్శివాయ...
చరణం: 1
పంచభూతములు ముఖ పంచకమై... ఆఋ ఋతువులూ ఆహార్యములై...(2)
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
స గ మ ద ని స గ గ మ ద ని స గ మ గగగ ససస ని గ మ గ స ని ద మ గ స
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై - నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా... ఆ...
నీ మౌనమే.. దశోపనిషత్తులై ఇల వెలయా...
ఓం...ఓం..
ఓం... నమశ్శివాయ...
చరణం: 2
త్రికాలములు నీ నేత్రత్రయమై.. చతుర్వేదములు ప్రాకారములై (2)
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు.. నీ సంకల్పానికి ఋక్విజవరులై...
అద్వైతమే నీ ఆది యోగమై - నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరి వాస నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా...
ఓం.. ఓం..
ఓం... నమశ్శివాయ..
చంద్ర కళాధర సహృదయా...
సాంద్రకళా పూర్ణోదయా.. లయ నిలయా...
song 2 --- naadhavinodhamu naatyavilaasamu - నాదవినోదము నాట్యవిలాసము
singers: SPB, sailaja S P & chorus
డు: वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये
जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ (కాళిదాసు)
वंदे पार्वतीप रमेश्वरौ...
డు: నాదవినోదము నాట్యవిలాసము పరమసుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదము
భావములో మె: ఆ...
భంగిమలో మె: ఆ...
గానములో మె: ఆ...
గమకములో మె: ఆ...
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌతపమీగతి సేయగ...
నాదవినోదము నాట్యవిలాసము పరమసుఖము పరము
మె: అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదము
మె: డు: ఆ ఆ ఆ ఆ ఆ ఆ
డు: ని ని మె: ని
డు: మ ద ని ని మె: ని
డు: మ ద ని స ని మె: ని
డు: రి స ని ద ని మె: ని
డు: మ గ మ ద ద గ మ మ రి గ స
మె: కైలాసాన కార్తీకాన శివరూపం... ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం
డు: కైలాసాన కార్తీకాన శివరూపం... ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం మె: ద ని స రి స ని స
జతియుత గమనం మె: ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
మె: డు: శిత గిరి చరణం సుర నది పయనం
డు: భరతమైన నాట్యం మె: ఆ
బ్రతుకు నిత్య నృత్యం మె: ఆ
భరతమైన నాట్యం మె: ఆ
బ్రతుకు నిత్య నృత్యం మె: ఆ
డు: తపనుని కిరణం తామస హరణం కో: ఉ ఉ ఉ ఉ ఉ ఉ
తపనుని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాశ్యం...
మె: ధి ర న ధి ర న న
డు: త కి త త కి త ధి మి
మె: ధి ర న ధి ర న న
డు: నాట్యం
మె: ధి ర న ధి ర న న
డు: త కి త త కి త ధి మి
మె: ధి ర న ధి ర న న
డు: లాశ్యం
డు: న మ క చ మ క స హ జం కో: మె: జం
డు: నట ప్రకృతీ పాదజం కో: మె: జం
డు: నర్తనమే శివ కవచం కో: మె: జం
డు: నటరాజ పాద సుమరజం కో: మె: జం
కో: మె: ధి ర న న డు: ధి ర న న కో: మె: ధి ర న న
డు: ధి ర న న ధి ర ధి ర ధి ర ధి ర ధి ర ధి ర ధి ర
నాదవినోదము నాట్యవిలాసము పరమసుఖము పరము
మె: అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదము
song 3 --- thakita thadhimi thakita thadhimi thandhaana తకిట తధిమి తకిట తధిమి తందాన
singer: SPB & chorus
పల్లవి:
తకిట తధిమి తకిట తధిమి తందాన... హృదయ లయల జతుల గతుల థిల్లానా (2)
తడబడు అడుగుల తప్పని తాళానా తడిసిన పెదవుల రేగిన రాగానా (2)
శ్రుతిని లయని ఒకటి చేసి
తకిట తధిమి తకిట తధిమి తందాన... హృదయ లయల జతుల గతుల థిల్లానా (2)
చరణం: 1
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన (2)
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా... తెలిసి తెలియని ఆశల వయసీ వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసి తెలియని ఆశల ల ల ల ల లా లా
ఏటి లోని అలల వంటి కంటి లోని కలలు కదిపి గుండియలను అందియలుగ చేసి
తకిట తధిమి తకిట తధిమి తందాన... హృదయ లయల జతుల గతుల థిల్లానా
తడబడు అడుగుల తప్పని తరిగిడతోం తరిగిడతోం తరిగిడతోం
తడిసిన పెదవుల రేగిన రాగానా ఆ ఆ ఆ
శ్రుతిని లయని ఒకటి చేసి
తకిట తధిమి తకిట తధిమి తం దా న
హృదయ లయల జతుల గతుల థి ల్లా నా
చరణం: 2
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం (2)
అలరులు కురియగ నాడెనదే.. అలకల కులుకుల అలమేల్మంగా (2)
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగు పాట పల్లవించు పదకవితలు పాడీ
ఆ.. ఆ. ఆ.. అ ఆ అ ఆ ఆ ఆ ఆ
తకిట తధిమి తకిట తధిమి తందా న... హృదయ లయల జతుల గతుల థిల్లా నా
తడబడు అడుగుల తప్పని తాళానా తడిసిన పెదవుల రేగిన రాగానా
తకిట తకిట తధిమి తధిమి తందాన... హృదయ లయల జతుల గతుల థిల్లానా
song 4 --- vedham.. aNuvaNuvuna naadham - వేదం అణువణువున నాదం
singer: SPB, saiaja S P
డు:
గ మ ని
గ మ గ స
మ గ స
గ స
ని
స ని ద మ గ
ద మ గ
మ గ
స రి స ని
గ మ గ రి
గ మ గ మ ద మ ద ని ద ని ద ని రి
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనేన్నో హంసా - నందీ రాగాలై
వేదం అణువణువున నాదం ఆ ఆ ...
సాగరసంగమమే ఒక యోగం
ని రి స ని ద మ గ గ ద మ గ రి స ని ని రి స ని ద మ గ
మ ద ని స రి స గ రి మ ద ద గ మ ద ని స ని ద మ గనిదమగరిస (?)
సాగరసంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృతగీతం
జీవితమే చిరనర్తనమాయే
పదములు తామే పెదవులు కాగ (2)
గుండియలే అందియలై మ్రోగ
వేదం అణువణువున నా..దం
మె:
ఆ ఆ ఆ ఆ ఆ
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ (2)
అతిధిదేవోభవ (2)
ఎదురాయే గురువైన దైవం
ఎదలాయే మంజీర నాదం
గురుతాయే కుదురైన నాట్యం
గురుదక్షినైపోయే జీవం
డు: నటరాజ పాదాన తలవాల్చనా నయనాభిషేకాన తరియించనా
మె: నటరాజ పాదాన తలవాల్చనా నయనాభిషేకాన తరియించనా
డు: సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతము గానా
మె: వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనేన్నో హంసా - నందీ రాగాలై వేదం
డు: जयन्तिते सुकृतिनो रसशिद्धा: कवीश्वरा:
नास्तितेषां यश: काये जरामरणजं भयं
नास्ति जरामरणजं भयं
नास्ति जरामरणजं भयं
మె: అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనేన్నో హంసా - నందీ రాగాలై
వేదం వేదం వేదం వేదం
song 5 --- ve vela gopammalaa - వే వేల గోపెమ్మలా
singers: SPB, sailaja S P
పల్లవి:
మె: వే వేల గోపెమ్మలా మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నలు దోచాడే
డు: ఆ హ హ హ వే వేల గోపెమ్మలా మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే
చరణం:
డు: మన్నుతిన్న చిన్నవాడే మిన్నుకన్న వన్నెకాడే ()
మె: కన్న తోడు లేనివాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుదితడేనే
డు: ఆ ఆ
మె: మోహనాల వేణువూదే మోహనాంగుదితడేనే
డు: ఆ.. చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మె: హా హ హ
వే వేల గోపెమ్మలా మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే
చరణం:
మె: వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే (2)
డు: రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
మె: ఆ ఆ
డు: గీతార్ధ సారమిచ్చి గీతాలెన్నో మార్చేనే
మె: నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే మా
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
డు: ఆ హ హ హ వే వేల గోపెమ్మలా మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే
మె: అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే డు: ఉ
మది వెన్నలు దోచాడే
డు: అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మె: ఉ
మది వెన్నలు దోచాడే
మె: హ హ హహహ వే వేల గోపెమ్మలా మువ్వగోపాలుడే
డు: మా ముద్దు గోవిందుడే