Saturday, April 14, 2012

geethaamjali - గీతాంజలి


music: iLayaraajaa

song 1 --- om nam: - ఓం నమః...
singers: Her Highness Jaanaki S, SPB

పల్లవి:
డు: ఉ ఉ ... ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం...
మె: ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం...
డు: నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో...
మె: ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో...

చరణం: 1
డు: రేగిన కోరికలతో గాలులు వీచగా
మె: జీవన వేణువులలో మోహన పాడగా
డు: దూరము లేని
దై లోకము తోచగా
మె: కాలము లేని
దై గగనము అందగా
డు: సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేల
మె: ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి... ఓం...

చరణం: 2
మె: ఒంటరి బాటసారి జంటకు చేరగా(?)
డు: కంటికి పాపవైతే రెప్పగ మారనా
మె: తూరుపు నీవుగా వేకువ నేనుగా
డు: అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
మె: ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
డు: జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

డు:మె: ఓం.. మె: నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం...
డు: ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం...
మె: నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో...
డు: ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో...



song 2 --- O paapaa laali - ఓ పాపాలాలి..
singer: SPB & Chorus 

పల్లవి:
ఓ పాపాలాలి.. జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తీయగా
ఓ పాపాలాలి.. జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా
ఓ పాపాలాలి 

చరణం: 1
నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా 
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక 
తలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో 
తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో 
చిరు చేపల కనుపాపలకిది నా మనవి 

ఓ పాపాలాలి.. జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తీయగా
ఓ పాపాలాలి 

చరణం: 2
ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో 
ఓ కోయిలా పాడవే నా పాటని తీయని తేనెలే చల్లిపో 
ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో 
సెలయేరుల అలపాటే వినిపించని గదిలో 
చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి 

ఓ పాపాలాలి.. జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తీయగా
ఓ పాపాలాలి.. జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా
ఓ పాపాలాలి 


song 3 --- O priyaa priyaa - ఓ ప్రియా ప్రియా...
Singers: SPB, chithra K S & Chorus 

పల్లవి:
డు: ఆ ఆ ఆ ఆ ఊ ఊ...
      ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
      ఏల గాలి మేడలు రాలు పూలదండలు 
      నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా
మె: ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా (2)
      ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు 
      నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయే 
డు: నేడు కాదులే రేపు లేదులే 
      వీడుకోలిదే వీడుకోలిదే 


చరణం: 1
మె: నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము
డు: రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
మె: గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
డు: జననాలు మరణాలు విడిచేది ప్రేమతో 
మె: ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకూ 
      రాజ శాసనాలకి లొంగిపోవు ప్రేమలు  
      సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ 

డు: ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
మె: ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కోరస్: మె: ఊ ఊ ఊ ..

చరణం: 2
మె: కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
డు: ఆ అనారు ఆశకి తాజ్ మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి
మె: నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే
డు: కథ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే
మె: వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా  
      పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
      జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ 

డు: ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
మె: ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
డు: కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి 
మె: నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన 
      లేదు శాసనం లేదు బంధనం 
      ప్రేమకే జయం ప్రేమదే జయం
        


song 4 ---  aamanee paadavey - ఆమని పాడవే
singer: SPB & Chorus 

పల్లవి:
ఆమని పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో 
పూసేటి పూల గంధాలతో 
మంచు తాకి కోయిలా.. మౌనమైన వేళలా...
ఆమని పాడవే హాయిగా (2)

మే: కోరస్: ఓ.. ఓ... హుళ్ళలుళ్ళ... ఓ .. 

చరణం: 1
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా 
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా 
పదాల నా ఎద స్వరాల సంపద
తరాల నా కథ క్షణాలదే కదా 
గతించి పోవు గాధ నేనని

ఆమని పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో 

చరణం: 2
శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం 
దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం 
మరో ప్రపంచమే మరింత చేరువై 
నివాళి కోరిన ఉగాది వేళలో 
గతించిపోని గాధనేనని 

ఆమని పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో 
పూసేటి పూల గంధాలతో 
మంచు తాకి కోయిలా.. మౌనమైన వేళలా...
ఆమని పాడవే హాయిగా (2)

song 5 --- nandhikonda vaagullona - నందికొండ వాగుల్లోన
singers: SPB, chithra K S & Chorus 

పల్లవి:
మె: ఓ  ఓ  ఓ ఓ నందికొండ వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా 
నా ఊరేది? డు: ఏది? నా పేరేది? డు: ఏది? నా దారేది? డు: ఏది? నా వారేరి? డు: యఃయా 
 
చరణం: 1
మె: ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికే నా పరుగు 
      ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నడుగు 
      మోహిని పిశాచి నా చెలిలే.. శాగిని(?) విశూచి నా సఖిలే
      విడవకురా వదలనురా ప్రేమేరా నీ మీద
      నందికొండ వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో
డు: భూత ప్రేత నిశాచ భేతాళ మారీ జం భం జడం భం భం 
      నంది కొండ వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో 
      చంద్ర వంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 
      నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా
      నీ కబళం పడతా నిను కట్టుకుపోతా 
      నీ భరతం పడతా నిను పట్టుకుపోతా ఆ ఆ ఓ ఓ..
 
చరణం: 2
డు: ఢాకిని ఢక్క ముక్కల చక్క డంబో తినిపిస్తాన్ 
      తాటకివనిపిస్తే తాటను వొలిచేస్తాన్
      గుంటరి నక్క డొక్కల చొక్కా అంబో అనిపిస్తాన్ 
      నక్కను తొక్కిస్తాన్ చుక్కలు కక్కిస్తాన్ 
      రక్కిసమట్ట తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
      తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ 
      రక్కిసమట్ట తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
      తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ 
      అస్త్రాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్ వస్త్రాయ జట్ జట్ జట్ ఫట్ 
      గోపాలా మ స జ స త త గ శార్దూలా 

      నంది కొండ వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో 
      చంద్ర వంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 
      నీడల్లే ఉన్నా న న న నీతో వస్తున్నా
      నీ కబళం పడతా నిను కట్టుకుపోతా 
      నీ భరతం పడతా నిను పట్టుకుపోతా ఏ ఏ ఏ ఏ 
      నంది కొండ వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో 
      చంద్ర వంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 


song 6 ---  jHallantha kavvintha - ఝల్లంత కవ్వింత
singer: chithra K S

పల్లవి:
ఝల్లంత కవ్వింత కావాలిలే.. వొళ్ళంత తుళ్ళింత రావాలిలే  (2)
ఉరుకులో  పరుగులో.. ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు 
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే (2)

చరణం: 1
వాగులు వంకలూ గలా గలా చిలిపిగా పిలిచినా 
గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా 
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో 
కోనచాటు కొండమల్లి దేహమంత(?) ముద్దులాడి వెళ్ళడాయే కళ్ళులేని దేవుడెందుకో మరి 

ఝల్లంత కవ్వింత కావాలిలే.. వొళ్ళంత తుళ్ళింత రావాలిలే  (2)
ఉరుకులో  పరుగులో.. ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు 
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే (2)

చరణం: 2
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా 
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా 
వాన దేవుడే కళ్ళాపి చల్లగ వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా 
నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాత పుట్టుకొచ్చే ఎవరికోసమో హు హు 

ఝల్లంత కవ్వింత కావాలిలే.. వొళ్ళంత తుళ్ళింత రావాలిలే  (2)
ఉరుకులో  పరుగులో .. ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు 
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే (2)


song 7 ---  jagada jagada jagadam - జగడ జగడ జగడం
singer: SPB & Chorus 

కోరస్: మె: చం చం చం చం
పల్లవి: 
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం.. ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం..
మరల మరణ జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 
మా ఊపిరి నిప్పుల ఉప్పెన - మా ఊహలు కత్తుల వంతెన 
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపంపం 
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం.. ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం..
మరల మరణ జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం


చరణం: 1
ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం సై అంటే సయ్యాటలో... హే హే
మా వెనుకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటలో 
నేడేరా నీకు నేస్తము రేపే లేదు 
నిన్నంటే నిండు సున్నరా రానే రాదూ 
ఏడేడు లోకాలతోనా బంతాటలాడాలి ఈనాడే  
తకతకదిమి తకఝణు
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం.. ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం..
మరల మరణ జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

చరణం: 2
పడనీరా విరిగి ఆకసం విడిపోనీ భూమి ఈ క్షణం మా పాట సాగేనులే హో హో 
నడి రేయే సూర్యదర్శనం రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే 
ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం 
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం 
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే 
తకతకదిమి తకఝణు

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం.. ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం..
మరల మరణ జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 
మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన 
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపంపం 
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం.. ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం..
తకిట తకిట తకధిమి తకధిమితక తకిట తకిట తకధిమి తకధిమితక తకిట తకిట తకధిమి తకధిమితక తకిట తాం తాం తాం తాం తాం 


No comments:

Post a Comment