Sunday, April 8, 2012

nemaliki neyrpina nadakalivi... నెమలికి నేర్పిన నడకలివి...

cinema: sapthapadhi
music: Mahadevan K V  
singer: Her Highness Janaki. S



పల్లవి:
నెమలికి నేర్పిన నడకలివి... మురళికి అందని పలుకులివి...
శృంగార సంగీత నృత్యాభినయవేళ... చూడాలి నా నాట్యలీలా...
నెమలికి నేర్పిన నడకలివి.. మురళికి అందని పలుకులివి...
శృంగార సంగీత నృత్యాభినయవేళ... చూడాలి నా నాట్యలీలా...
నెమలికి నేర్పిన
ఆ...నెమలికి నేర్పిన నడకలివి...


చరణం: 1
కలహంసలకిచ్చిన పదగతులు  - ఇలకోయిల మెచ్చిన స్వరజతులు (2)
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు (2)
కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా వల్పశిల్ప మణి మేఖలనూ - శకుంతలను 
హో.. నెమలికి నేర్పిన నడకలివి...

చరణం: 2
చిరునవ్వులు అభినవ మల్లికలు - సిరిమువ్వలు అభినయ దీపికలు(2)
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు (2)
కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్ర లేఖనాలేఖ సరస సౌందర్య రేఖనూ - శశిరేఖను 


ఓ... నెమలికి నేర్పిన నడకలివి... మురళికి అందని పలుకులివి...
శృంగార సంగీత నృత్యాభి నయవేళ.. చూడాలి నా నాట్యలీలా...
నెమలికి నేర్పిన నడకలివి.. మురళికి అందని పలుకులివి...
శృంగార సంగీత నృత్యాభి నయవేళ.. చూడాలి నా నాట్యలీలా...
నెమలికి నేర్పిన నడకలివి...


1 comment:

  1. Swarajathulu
    Kinneralu
    Deepikalu
    Chandhrikalu...

    Sakunthala, Sasirekha...


    Evariki saadhyam ee saahithee vinyaasam!!!!



    Visleshaneswari, India.

    ReplyDelete