Saturday, April 21, 2012

jeevitham sapthasaagara geetham... జీవితం.. సప్తసాగర గీతం


cinema: chinni krishNudu
music: Burman, Rahul Dev
Singers: Aasa Bhonsle, SPB


పల్లవి:
మె: త ర రా రా ర ర ర రా తార ర ర ర రా త ర త ర రా 
జీవితం.. 
సప్తసాగర గీతం 
వెలుగు నీడలా వేదం
సాగనీ పయనం...
కల ఇల కౌగిలించే చోట (2)
(పల్లవి)

ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ర ప 

చరణం: 1
మె: ఏది భువనం ఏది గగనం తారా తోరణం 
      ఈ చికాగో sears tower-a స్వర్గ సోపానము 
      ఏది సత్యం ఏది స్వప్నం disney జగతిలో 
      ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము
డు: హే.. బ్రహ్మ మానస గీతం మె: ఓ
      మనిషి గీసిన చిత్రం మె: ఓ 
      చేతనాత్మక శిల్పం..
మె: జీవితం.. 
      మతి కృతి పల్లవించే చోట (2)
      సప్తసాగర గీతం 
      వెలుగు నీడలా వేదం
      సాగనీ పయనం...
      కల ఇల కౌగిలించే చోట (2)

చరణం: 2
మె: ఆ liberty శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులు 
      ఐక్యరాజ్య సమితిలోన కలిసే జాతులు 
      ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు 
      ఈ miami beach కన్న ప్రేమ సామ్రాజ్యము 
డు: హే.. సృష్టికే ఇది అందం    మె: ఓ..
      దృష్టి కందని దృశ్యం    మె: ఓ 
      కవులు రాయని కావ్యం 
      కృషి ఖుషి సంగమించే చోట (2)
      
మె: జీవితం.. 
      సప్తసాగర గీతం 
      వెలుగు నీడలా వేదం
      సాగనీ పయనం...
      కల ఇల కౌగిలించే చోట (2)
      
      ఆ ఆ ఆ... 


1 comment:

  1. english words ni english lone raayadam anedhi ikkada cheppukodhagina vishayam... from Visleshaneswari, India.

    ReplyDelete