Sunday, April 15, 2012

raambantu - రాంబంటు



raambamtu - రాంబంటు
music: keeravaaNi M M


song 1 --- baalachilaka
singer: chithra krishNa saanthi

బాల చిలక పరువాల సొగసు కనవేల ఎందుకీ గోల తగవులింకేల అధరమధురాల  గ్రోల మురిపాల తేల
రసకేళికే తగన ఏల.. నన్నేల...
ఏలా.. నీ దయా రాదూ.. పరాకు చేసేవేలా సమయమూ కాదూ 

రారా రామయ్య రారా రారా.. శృంగార వీర..  
రారా నా జీవ గాత్రా.. సుమశర గోత్ర..  
సాల గడిచేనీ రేయి వలపు తరువాయి తలుపులే మూయి 
దొరకదీ హాయి మనసుకనవోయి మనకు తొలిరేయి 
కాంతపై ఏలా నన్నేల.. 
ఏలా నీ దయా రాదూ...పరాకు చేసేవేలా సమయమూ కాదూ 

వాహనాల మణిభూషణాల భవనాల నేను కోరితినా
లేత వయసు తొలి పూత సొగసు నీ చెంతనుంచకా దాచితినా 
సగము సగము జత కాని తనువుతో తనివి తీరాకా మనగలనా...
కడలి తరగాలా సుడులు తిరిగి కడ కొంగు తెరలలో పొంగి పొరలు ఈ వరద గోదారి వయసు కే దారి 
పెళ్ళాడుకున్న  ఓ బ్రహ్మచారి 
ఏలా.. నీ దయా రాదూ.. పరాకు చేసేవేలా సమయమూ కాదూ 


song 2 --- chandhamaama kanchametti 
singer: SPB , chithra krishNa saanthi 

మె: ఆ.. యా.. యాహా .. ల లాల లా ఆహ ఆహ లలాలలా  ఆహ ఆహ ఉహూహుహూ 
     సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వపెట్టి 
     సందెమసక చీరగట్టి సందుజూసి కన్నుగొట్టి 
     సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు 
     అరటిపువ్వు తెస్తాడు అడవిపురుషుడు 
     ల లాలలా... ల లాలలా...
     సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వపెట్టి 
     సందెమసక చీరగట్టి సందుజూసి కన్నుగొట్టి 
డు: బద్రాద్రి రామన్న పెళ్లికొడుకివ్వాలా సీతలాంటి నిన్ను మనువాడుకోవాలా
     బెజవాడ కనకదుర్గ బాసికాలుదేవాల బాసర్ల సరస్వతి పసుపుకుంకుమ లివ్వాల

చరణం: 1
మె: విన్నపాలు వినమంటే విసుగంటాడు 
     మురిపాల విందంటే ముసుగెడతాడు
     విన్నపాలు వినమంటే విసుగంటాడు 
     మురిపాల విందంటే ముసుగెడతాడు
     బుగ్గపండు కొరకడు పక్క పాలు అడగడు
     పలకడు ఉలకడు పంచదార చిలకడు
     కౌగిలింతలిమ్మంటే కరుణించడు
     ఆవులింతలంటాడు అవకతవకడు 
     హ హా హా హా ల లా లా లా
     సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వపెట్టి 
     సందెమసక చీరగట్టి సందుజూసి కన్నుగొట్టి హహహహ 
డు: ఏడుకొండల సామి ఏదాలు జదవాల చెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల
      అన్నవరం సత్తెన్న అన్న వరాలివ్వల సింహాదిరి అప్పన్న సిరిశేసలివ్వలా

మె: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హేహే హేహేహే హేహేహేహే.. హేహే హేహేహే హేహేహేహే...

చరణం:
మె: పెదవి తేనేలందిస్తే పెడమోములు తెల్లారి పోతున్న చెలి నోములు (2)
     పిల్ల సిగ్గు చచ్చిన మల్లెమొగ్గ విచ్చిన కదలడు మెదలదు కలికి పురుషుడు
     అందమంత నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురుబెండడు
     ల లాలలా... ల లాలలా...

song 3 --- kappalu appalaipovachhu 
singer: SPB 

పల్లవి:
కప్పలు అప్పాలైపోవచ్చు సున్నం అన్నాలైపోవచ్చు
నేలను చాపగ చుట్టావచ్చు నీటితో దీపం పెట్టావచ్చు 
ఏమో.. చుచు చుచు చుచు...ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు 
కప్పలు అప్పాలైపోవచ్చు సున్నం అన్నాలైపోవచ్చు
నేలను చాపగ చుట్టావచ్చు


చరణం: 1
ఆనాటి నీతల్లి ఆకాశ జాబిల్లి తారలన్ని నీకు తలంబ్రాలుపోసి 
హరివిల్లు దిగివచ్చి హరివంటి పతినిచ్చి వెళ్లావచ్చు... రోజు మళ్ళవచ్చు
ఆ మారు తల్లైన తల్లల్లె తామారి పట్టు చీరలు కట్టి పరమాన్నం వడ్డిస్తే 
ఆరారు కాలాల నీకంటి నీలాలు ఆరావచ్చు... మనసు తీరావచ్చు 
దైవాలు పెట్టెను లగ్గాలు పెళ్ళిళ్ళ లోగిళ్ళు స్వర్గాలు 
ఆ నింగి ఈ నేల పాడాలనీ పాట ఈ పూటా 
పాములు పాలు ఇవ్వవచ్చు బెబ్బులి పిల్లిగ మారావచ్చు 
నవ్విన చేను పండవచ్చు రోకలి చిగురు వేయవచ్చు 
ఏమో.. చుచు చుచు చుచు.. ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు 

చరణం: 2
ఏడింట సూరీడు ఏలుతున్నాడు రాకుమారుడు నీకు రాసి ఉన్నాడు 
రతనాల కోటకే రాణి వంటాడు పగడాల దీవికే దేవి వంటాడు 
గవ్వలు రవ్వలు కానూ వచ్చు కాకులు  హంసలు ఐపోవచ్చు  
రామ చిలుక నువ్వు కానూవచ్చు రాంబంటు కలా పండావచ్చు
ఏమో.. చుచు చుచు.. ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు 

కప్పలు అప్పాలైపోవచ్చు సున్నం అన్నాలైపోవచ్చు
నేలను చాపగా చుట్టావచ్చు నీటితో దీపం పెట్టావచ్చు 
ఏమో..చుచు చుచు చుచు..
మె: ఊ ఊ హు హు హు హు 

song 4 --- కుక్కుటేశ్వర కునుకు సాలురా...
singer: SPB


పల్లవి: అ అఅ అ అ అ అ అ  
కుక్కుటేశ్వర కునుకు సాలురా నీవు లేవరా నిదర లేపరా (2)
కొక్కోరుక్కో.. మేలుకో...(2)
కుక్కుటేశ్వర కునుకు సాలురా నీవు లేవరా నిదర లేపరా

చరణం: 1
ఆటీను ఇస్పేట్ డైమను రాణుల అలకదీర్చర అప్పుజేసి 
కాఫీ సిగరెట్టు ఉప్మా పెసరట్టు పరువు పెంచర పద్దురాసి
సిగ్గు శరములు గాలికి వదిలి క్లబ్బుకి కదలక లెమ్మి ఇక లెమ్మి 
రమ్మి ఇటు రమ్మి.. 
నిను నీవే సేయగ దొమ్మి
నీ కనులకు పొరలే కమ్మి
సాటి ఆటకులనమ్మి 
నాటి ఆస్తి తెగనమ్మి
ఢంకా పలాసుగా కుంకా కులాసగ 
కోకో కో కో కో క్కో క్కో కో క్కో క్కో క్కో ..కొక్కోరుక్కో.. మేలుకో..
ఓ ఓ ... మేలుకో...
కుక్కుటేశ్వర కునుకు సాలురా నీవు లేవరా నిదర లేపరా


చరణం: 2
మధు దేవి గుడి తలుపు తెరిసేటి యేళాయే నిదర ఈరా ఇంక మేలుకో 
పానకాలస్సామి పూనకేశ్వరితోన ఊరేగు యేళాయే మేలుకో
గోలి సోడా బుడ్డి కెవ్వుమంటున్నాది జాలి సూపి సామి మేలుకో
బారులో దేశి ఇదేశీయ మద్యాలు పద్యాలు పాడేను మేలుకో 
తిన్నదరిగే లాగ దున్నపో మారాజు కుడితి దాగుదువు మేలుకో
మేలుకో మేలుకో మేలుకో... కొక్కోరుక్కో.. హో హో హో... మేలుకో.. అః 
అః కొక్కో

చరణం: 3
అల్లరెందుకు రారా నల్ల గోపాల - సిందులాపర సామి సిన్ని గోవింద(2)
అమ్మ కడుపే సల్లగ మాయమ్మవలపే వెన్నగా
రవ్వ సేయక తాన మాడరా మువ్వ గోపాలా  
నలుగు పెట్టే ఏళ అలకల్లు ముద్దు 
సమురు బెట్టే సెయ్యి దరువుల్లు ముద్దు
నలుగెట్టిన పిండి నాకు గణపతిగా 
ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా 
తల అంటూ పోసేటి రాంబంటు పాట
కలగంటూ పాడాల కలవారి ఇంట 
రాలచ్చి ఇచ్చింది ఈ రాస పుటక 
శీలచ్చి దోచింది నీ సేతి ఎముక 
మీ ఉప్పు తిని అప్పు పడ్డానుగనక 
తీర్చలేని ఋణము తీర్చుకోమనకా 

1 comment:

  1. ఇలాంటి అరుదైన పాటలు అరుదైన బ్లాగ్ లో దొరకడం మా అదృష్టం..,ఊరికే పోదు మీరు పడిన ఈ కష్టం !

    సందమామ కలముపట్టి ,సన్నజాజి మాటకట్టి,
    సందె మసక పాటకేమో సందు సూసి బాణీ కట్టి !

    ReplyDelete