Saturday, April 7, 2012

alai pomgeraa.. kanna...అలై పొంగెరా.. కన్నా...


Cinema: sakHi
Music: rehman A R
Singers: kalpana, hariNi, kaLyaNi menon

అలై  పొంగెరా.. కన్నా... మానసమలైపొంగెరా...
ఆనంద మోహన వేణుగానమున... 
ఆలాపనే కన్నా... మానసమలై పొంగెరా...
నీ నవరస మోహన వేణుగానమది...
అలై  పొంగెరా.. కన్నా.. ఆ....
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగే నది రాదురా ప్రాయమున యమున మురళీధర యవ్వన...
అలై పొంగెరా.. కన్నా...

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా...
కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలటు పొంగే 
కాదిలి వేణుగానం కానడ పలికే 
కన్నె వయసు కళలొలికే వేళలో.. కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే 
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా 
నిశాంత మహీచ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా 
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా 
కడలికి అలలకు కథకళి కళలిడు శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవి కిరణాలే రచించవా 
కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో 
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మమ్మవునో 
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమది గేయము పలుకగ...

అలై  పొంగెరా.. కన్నా... మానసమలైపొంగెరా...
నీ ఆనంద మోహన వేణుగానమున... 
ఆలాపనే కన్నా... కన్నా...

No comments:

Post a Comment