చిత్రం: చిన్నికృష్ణుడు
గానం: Her Highness S. జానకి
సంగీతం: Rahul Dev Burman
పల్లవి:
మౌనమే ప్రియా... ధ్యానమై...
నీలి కన్నులా నిలిచీ పిలిచే నా ప్రేమ...
మౌనమే ప్రియా... ధ్యానమై...
చరణం: 1
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
పొద్దే తాంబూలాలై ఎర్రనాయే సంధ్యలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయే
ఈ దూరం దూరతీరం
ముద్దులాడేదెన్నడో...
చరణం: 2
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
వచ్చే మాఘమాసం పందిరేసే ముందుగానే
మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం
మనువాడేదెన్నడో...
ఓ దేవా వేటూరి..
ReplyDeleteనీ రచన ఒక అద్భుతం..
తెలుగు తల్లి నిన్ను తన కమ్మని ఒడిలో పెంచితే
ఆ తల్లిని నీ పాటల ఊయలలతో అలరించిన ముద్దు బిడ్డవు నువ్వు...
ధన్యోస్మి మహాప్రభో...
This comment has been removed by the author.
ReplyDeleteఈ పాట గురించి "చెప్పాలంటే నాలో మాటే శ్రీకారాలు,
ReplyDeleteపల్లవిలో కాగే చేరణాల మందారాలు".!
idhi oka arudhaina paata ane cheppali...
ReplyDeleteThana soul mate kosam aalochisthoo, thanu pade thapana paatalo kanipisthundhi.. Tune entha goppadho, orchestra feeding anthe goppadhi.. antha kante mana janakamma rendition, Anirvachaneeyam, athyadhbhutham.. idhi jagamerigina sathyam.. ee paatani blog lo unchi.. deeniki oka unnathamaina sthaanam kalpinchina aa vyakthi.. nijamga DHANYULU.....
from Visleshaneswari, India.