cinema: aadithya 369
music: iLayaraaja
singers: Her Highness Janaki. S, SPB, Sunamdha
(జతులు)
పల్లవి:
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
స్వరరాగ సంగమ సాధక జీవన
సురగంగ పొంగిన నర్తనశాలల
పదములు చేరగ భంగిమలూదే
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
చరణం: 1
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో దాచెనులే కడలి
ఆ... నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి
రాయని చదువే రసనలు దాటే రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పువ్వును మీటే నాట్య కళావనిలో
నాకు వచ్చు నడకల గణితం - నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవవిధ గమకం - నాకు ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్తగీతముల
ఉత్తమోత్తమము వృత్తగీతముల మహా మహా సభాసదులు మురిసిన...
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
చరణం: 2
స్పందించే వసంతాల త క ఝ ణు హంపీ శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధును సర్వామోద సంగీతమై
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై
నాలో ఉన్న చిన్నారి కళలివి నా నా చిత్ర వర్ణాంకమై
వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ (2)
మ మ గ గ మ ద మ - మ మ ద స ని ద మ
రంపంప రంపపంప (3)
భరతము నెరుగని - నరుడొక రసికుడు
rock-u roll-u ఆట చూడు - బ్రేకు లోని సోకు చూడు
west side-u rhyme మీద twist చేసి పాడి చూడు
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు
rock rock rock n roll shake shake shake n roll (2)
రప్ప పా ప - ప పా ప - ప పా ప
ర పా ప పా ప పా ప పా ప పా ప పా ప పా ప
తగుదు .... త త
జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
అప్పుతచ్చులున్నాయేమో.. అని చూశ, కాని ఏవి? ఎక్కడ ?
ReplyDeleteచాల బాగుంది.!
ee paatalo paadhaalani vini, correct ga raayadam anedhi chaala goppadhi.. mr or miss or mrs veturi saahithe prabHa.. meeru abhinandhaneeyulu!!!!!!
ReplyDeleteVisleshaneswari, India.