Wednesday, April 11, 2012

aum.. nam: sivaayaa... ఓం.. నమశ్శివాయ...


cinema: saagarasamgamam 
music: iLayaraajaa
singer: Her Highness Janaki S

పల్లవి:
ఓం.. ఓం.. ఓం..
ఓం.. నమశ్శివాయ.. ఓం.. నమశ్శివాయ...
చంద్ర కళాధర సహృదయ... (2)
సాంద్రకళా పూర్ణోదయ.. లయ నిలయా...
ఓం...
ఓం... నమశ్శివాయ.. ఓం... నమశ్శివాయ...


చరణం: 1
పంచభూతములు ముఖ పంచకమై... ఆఋ ఋతువులూ ఆహార్యములై...(2)
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై 
స గ మ ద ని స గ గ మ ద ని స గ మ గగగ ససస ని గ మ గ స ని ద మ గ స  
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై - నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా... ఆ...
నీ మౌనమే.. దశోపనిషత్తులై ఇల వెలయా...
ఓం...ఓం..
ఓం... నమశ్శివాయ...

చరణం: 2
త్రికాలములు నీ నేత్రత్రయమై.. చతుర్వేదములు ప్రాకారములై (2)
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు.. నీ సంకల్పానికి ఋక్విజవరులై...
అద్వైతమే నీ ఆది యోగమై - నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరి వాస నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా...

ఓం.. ఓం..
ఓం... నమశ్శివాయ.. 
చంద్ర కళాధర సహృదయా...
సాంద్రకళా పూర్ణోదయా.. లయ నిలయా...

3 comments:

  1. Blog chaala baagundi.

    I love the way uu addressed Janaki amma " Her Highness"

    ReplyDelete
    Replies
    1. Thanks for your words... as for as I am concerned, She is the unquestionable queen of the art - playback singing!

      Delete
  2. ee paata ni janaki garu paadina theeru... no comments.. no words to say...



    Visleshaneswari, India.

    ReplyDelete