Sunday, April 22, 2012

e dhuryodHana dhusyaasana... ఈ దుర్యోధన దుశ్యాసన...


cinema: prathigHatana
music: chakravarthy
singer: Her Highness Janaki S




ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో 
రక్తాశృలు చిందిస్తూ రాస్తున్నా... శోకంతో
మరో మహాభారతం... ఆరవ వేదం
మానభంగపర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. నిర్వేదం... 


పుడుతూనే పాలకేడ్చి.. పుట్టీ జంపాలకేడ్చి
పెరిగి పెద్ద కాగానే.. ముద్దూ మురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు 
మగసిరితో బ్రతకలేక కీచకులై.. కుటిలకామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే... 
మీ అమ్మల స్తన్యంతో
మీ అక్కల రక్తంతో 
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం 
మరో మహాభారతం... ఆరవ వేదం
మానభంగపర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. నిర్వేదం...


కన్నమహా పాపానికి ఆడది తల్లిగ మారి 
మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి 
పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర 
ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర 
ప్రతి భారతసతి మానం చంద్రమతి మాంగళ్యం
మర్మస్థానం కాదది నీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం 
శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే 
మానవ రూపంలోనే దానవులై పెరిగితే 
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే 
కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ ఐన ద్రౌపది ఆక్రందనలో 
నవ శక్తులు యువ శక్తులు నిర్వీర్యం అవుతుంటే 
ఏమై పోతుంది సభ్య సమాజం 
ఏమై పోతుంది మానవ ధర్మం 
ఏమై పోతుంది ఈ భారత దేశం మన భారత దేశం...
మన భారత దేశం...

1 comment:

  1. I want
    1. Song Mp3 (don't have here)
    2. lyrics (we have here)
    3. youtube video of it. (only 1 provided here).

    of all songs. try it.

    ReplyDelete