cinema: sakHi
ఆలాపన:
కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు (2)
music: rehman A R
singer: swarnalatha
ప్రేమలే నేరమా ప్రియా ప్రియా.. వలపు విరహమా ఓ నా ప్రియా...
మనసు మమతా ఆకాశమా.. ఒక తారై మెరిసిన నీవెక్కడో...
పల్లవి:
కలలై పోయెను నా ప్రేమలు... అలలై పొంగెను నా కన్నులు (2)
మదికే అతిధిగ రానేలనో శెలవైనా అడగక పోనేలనో
ఎదురు చూపుకూ నిదరేదీ ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన మనిషెక్కడో...నా పిలుపే అందని దూరాలలో...
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులు
చరణం: 1
అనురాగానికి స్వరమేది సాగర ఘోషకు పెదవేది (2)
ఎవరికి వారే ఎదురు పడీ ఎదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలిక పడి
నిను చేరగనేనీ శిలనైతిని
ఎండమావిలో నావను లే ఈ నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులు
చరణం: 2
వెన్నెల మండిన వేదనలో కలువ పూవులా కలతపడి (2)
చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగా మిగులునని
నీకై వెతికా కౌగిలినై
నీడగ మారిన వలపులతో
అలిసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో
This comment has been removed by the author.
ReplyDeleteRahman, veturi...
ReplyDeleteIdhi oka superb combination ane cheppali.. Enno adhbhuthamaina paatalu vachayi veeri combination lo.. andhulo idhi kooda okati..
Swargeeya Swarnalatha garu, thana voice tho praaNam posaarane cheppali ee paata ki.
Visleshaneswari, India.